మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి
NEWS Oct 19,2024 06:46 am
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు పనులను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మూడేళ్లలో అమరావతి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సీఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని.. మిగిలిన పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో పెట్టుబడులు పెట్టిన వారికే భూములిచ్చామని చెప్పారు. ఇన్వెస్టర్లకు మౌలికవసతులు అవసరమని.. వారికి రోడ్లు, నీరు వంటి అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.