కీసరగుట్టలో మహిళా అఘోరి ప్రత్యక్షం
NEWS Oct 19,2024 06:12 am
మహిళా అఘోరి(శివ విష్ణు బ్రహ్మ) తాజాగా కీసరగుట్టలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా భస్మాభిషేకం చేశారు. ఒంటి కాలిపై నిలబడి ఆ మహాదేవుడిని ధ్యానించారు. తన స్వస్థలం మంచిర్యాల అని, ఏడేళ్ళ వయసులో గురువు ఇచ్చిన అఘోరి దీక్షతో హిమాలయాలకు వెళ్లానని, ప్రస్తుతం 27ఏళ్ళని, తాను 18శక్తి పీఠాలు, 12జ్యోతిర్లింగాలు దర్శించుకున్నట్టు తెలిపారు.