లక్షన్నర కోట్ల స్కామ్..!- కేటీఆర్
NEWS Oct 18,2024 05:14 pm
మూసీ నదిపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. మూసీపై రేవంత్ రోజుకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజెంటేషన్ పేరుతో తన పరువు తీసుకున్నారని విమర్శించారు. చేయని సర్వేను చేసినట్లుగా రేవంత్ అబద్దాలు చెప్పారని, మూసీ పేరుతో లక్షన్నర కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఢిల్లీకి పంపే మూటల కోసమే మూసీపై రేవంత్‌కు ప్రేమ ఉందన్నారు.