హర్షసాయి కేసులో మరో ట్విస్ట్
NEWS Oct 18,2024 05:10 pm
యూట్యూబర్ హర్షసాయి మీద లైంగిక దాడి కేసు నేపథ్యంలో నేడు మరో కీలక మలుపు చోటు చేసుకుంది. హర్షసాయికి అనుకూలంగా, తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని బాధితురాలు.. ఆర్జే శేఖర్ బాషాతోపాటు మరికొంతమంది మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు ఆర్జే శేఖర్ బాషాను విచారించారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉండగా.. అతని గురించి మరింత సమాచారం రాబట్టేందుకు శేఖర్ ను ప్రశ్నించినట్టు సమాచారం