AP: ఇసుక ఇలా ఉచితంగా తీసుకెళ్లొచ్చు..!
NEWS Oct 18,2024 04:44 pm
ఉచిత ఇసుక విధానంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్లతోపాటు ట్రాక్టర్లలోనూ ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించింది. స్థానిక అవసరాల కోసం గతంలో ఎడ్లబండ్లకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉంటే.. ప్రస్తుతం ఈ నిబంధనను ట్రాక్టర్లకూ వర్తింపజేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.