100 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు
NEWS Oct 18,2024 04:18 pm
ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఇప్పటి వరకు 100 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక 48 గంటల్లోనే ఈ పథకాన్ని అమలులోకి తెచ్చామన్నారు. గద్వాలలో పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులమయంగా మార్చారని బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.