పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు
NEWS Oct 18,2024 03:18 pm
మెట్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈపోటీలను జిల్లా డిఎస్పీ ఉమామహేశ్వరరావు సీఐ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. మెట్ పల్లి చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. ఈ మేరకు క్రీడాకారులకు పోలీస్ సిబ్బంది వాలీబాల్ కిట్లను అందజేశారు. ఫస్ట్ ప్రైస్ రూ. 3000 మెట్పల్లి టీం కైవసం చేసుకుంది. సెకండ్ ప్రైజ్ రూ. 2,000 వాల్గొండ టీం కైవసం చేసుకుంది, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు క్యాష్ ప్రైస్ ని అందజేశారు