Logo
Download our app
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో
NEWS   Oct 18,2024 04:53 pm
టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఎంపీడీఓ విట్టల్, ఏపీఎం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన‌ట్టు చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి మొసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source