మెరకచింతలో టెర్రాసింగ్ పనులు షురూ
NEWS Oct 18,2024 04:23 pm
హుకుంపేట మండలంలోని, మెరకచింత పంచాయితీలో పల్లె పండగలో భాగంగా కొత్త పనులను సర్పంచ్ దూసూరు పద్మ కుమారి, ఎంపీటీసీ నైని రజని, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు కలిసి టెర్రాసింగ్ పనులు ప్రారంబించారు. టెర్రా సింగ్ పనులతో.. రైతుల వ్యవసాయం అభివృద్ధి చెందనుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ సర్పంచ్ దూసూరు వెంకటరావు బాకూరు, సూపర్ ఎంపీటీసీ నైని సత్యబాబు,సెక్రెటరీ శైలజ, మెరకచింత వైస్ సర్పంచ్ నైని బొంజు బాబు, మాజీ సర్పంచ్, సీపీఎం మండల కార్యదర్శి వలసనైని లక్షణ్ తదితరులు పాల్గొన్నారు.