విద్యుత్ చార్జీల పెంపుపై CPM నిరసన
NEWS Oct 18,2024 04:28 pm
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీల పెంపునకు, ప్రభుత్వం తీసుకొచ్చే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హుకుంపేట విద్భుత సబ్ స్టేషన్ల వద్ద సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం మండల కమిటీ సభ్యులు పాంగి లింగమూర్తి మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడం వలన ఆర్థిక భారాలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.