డ్రైడే, పరిశుభ్రతపై అవగాహనా ర్యాలీ
NEWS Oct 18,2024 04:29 pm
అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ కేంద్రంలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ శెట్టి నీలవేణి అధికారులు నిర్వహించిన పరిసరాల పరిశుభ్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను రహదారులపై పడవేయవద్దని అదే విధంగా బహిరంగ మలమూత్ర విసర్జనలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అధికారులు స్థానిక ప్రజా ప్రజలతో కలిసి శ్రమదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిలకలగెడ్డ ఎంపీటీసీ సభ్యురాలు తడిబారికి మితుల, ఎంపీడీవో ఏవివి కుమార్, ఈఓఆర్డి లాలం సీతయ్య, సెక్రటరీ వున్నారు.