అందోల్: తహశీల్దార్ విష్ణుసాగర్.!
NEWS Oct 18,2024 12:04 pm
సంగారెడ్డి జిల్లా అందోల్ తహశీల్దార్ గా విష్ణుసాగర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి తహశీల్దార్ గా పనిచేసిన ఆయన బదిలిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ విష్ణుసాగర్ మాట్లాడుతూ.. భూసంబంధ ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.