Logo
Download our app
కాంగ్రెస్ పార్టీ నాయకుల కమిటీలు వ‌ద్దు
NEWS   Oct 18,2024 04:47 pm
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల కమిటీలు కాదని తాడ్వాయి మండల MPDOని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు BRS నాయ‌కులు. గతంలో BRS ప్రభుత్వం ఉన్నపుడు ఎలాంటి కమిటీలు వేయాలన్న గ్రామ సభ పెట్టి వేసేది కానీ ఇపుడు ఎలాంటి సమాచారం లేకుండా కమిటీలను ఏర్పాటు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. నిజమైన లబ్ధిదారులకు నష్టం జరిగే అవకాశం ఉంద‌ని, MPDO స్పందించి గ్రామసభలు నిర్వహించాలని, కొత్త కమిటీలు వేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ వైస్ఎంపిపి నర్సింలు, సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,రాజా గౌడ్, త‌దిత‌రులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source