Logo
Download our app
సర్వాంగ సుందరంగా పార్కు తీర్చిదిద్దుతున్నాం
NEWS   Oct 18,2024 10:06 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ కమిషనర్ మోహన్ చెప్పారు. పట్టణ ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. వనమహోత్సవం డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా అయన అంబేద్కర్ పార్కును పరిశీలించి, డివైడర్లపై ఉన్న మొక్కలకు నీరు పట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ సిబ్బంది రత్నాకర్, విష్ణు, ముజీబ్ తదితరులున్నారు.
⚠️ You are not allowed to copy content or view source