Logo
Download our app
అంగరంగ వైభవంగా దుర్గాదేవి ఊరేగింపు
NEWS   Oct 18,2024 10:15 am
కొండపల్లిలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా కొండపల్లి పురవీధుల్లో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మంగళ వాయిద్యాలు మధ్య కొనసాగిన ఈ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ వేష ధారణలో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source