వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 18,2024 10:08 am
కొల్చారం మండలం కొంగోడు నాయిని జలాల్పూర్ పిఎసిఎస్ కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు పిఎసిఎస్ సీఈవో సాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. రైతులకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రభుత్వం కేటాయించిన క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి 2320 బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలు ధరకే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, 48 గంటల్లో రైతులకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దళారీల మాటలు నమ్మవద్దని సూచించారు.