వేధింపులు - మైనర్ బాలిక ఆత్మహత్య
NEWS Oct 18,2024 03:39 am
జగిత్యాలలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (14) ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత కొంత కాలంగా తన క్లాస్ మేట్ వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందని కుటుంబ సభ్యుల చెబుతున్నారు. కూతురి మరణంతో ఏడుస్తూ సృహ కోల్పోయింది తల్లి. ఆమెని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.