రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం
NEWS Oct 17,2024 06:10 pm
TG: రాష్ట్రంలో జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానం మాదిరే ఒకరికి 6కేజీల చొప్పున బియ్యం అందిస్తామన్నారు. అటు త్వరలో కొత్తగా జారీ చేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులైన నిరుపేదలనే ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.