కొండగట్టు పరిశుభ్రతకు ప్రత్యేక ఏర్పాట్లు
NEWS Oct 17,2024 06:02 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు మలవిసర్జన చేయకుండా ఉండేందుకు 8 మంది సెక్యూరిటీ, హోంగార్డులకు బాధ్యతలు అప్పగించినట్లు ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసర ప్రాంతాలను తిరిగి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. శౌచాలాయాలను వినియోగించుకునేలా ప్రత్యేక నిఘా వేయాలని ఆదేశించారు.