ముత్యాలమ్మ చెంతకు మహిళా అఘోరీ
NEWS Oct 17,2024 05:45 pm
సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఈ ఆలయంలో శాంతి, చండీ హోమం పూర్ణాహుతి పూజలు జరుగుతున్న సమయంలో ఆలయంలోకి ఓ మహిళా అఘోరి (నాగసాధు) వచ్చింది. భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అమ్మవారే వచ్చిందాని భక్తులు నమ్ముతూ నీళ్లు సాక పోశారు. ఆలయానికి వచ్చిన అఘోరీ హోమంలో పాల్గొని, ఒంటి కాలుపై నిలబడి పూజలు చేశారు.