వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
NEWS Oct 17,2024 05:50 pm
అల్లాదుర్గం మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ మల్లయ్య, ఎంపీడీవో శంకర్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని క్వింటాలుకు రూ. 2320 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వరి ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.