శ్రీ భవాని ఆలయంలో ఘనంగా చండీ హోమం..
NEWS Oct 17,2024 01:23 pm
దసరా నవరాత్రులు ముగించుకొని ఆశ్వీయుజ పున్నమి సందర్భంగా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని భవాని ఆలయంలో పూజారి కృష్ణశర్మ ఆధ్వర్యంలో ఆలయ ధర్మ కర్తలు ఆర్యన్ శ్రీనివాస్,ఆర్యన్ సంతోష్ దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి వేదమంత్రోచ్ఛారణల మధ్య భవాని అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరించారు. అనంతరం కుంకుమార్చనలు చండీ హోమాన్ని నిర్వహించారు..