భారత్‌లో దాక్కున్న షేక్ హసీనాకు
బంగ్లాదేశ్ అరెస్ట్ వారెంట్ జారీ
NEWS Oct 17,2024 11:23 am
భారత్‌లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్.. షేక్ హసీనాను నవంబర్ 18 లోగా అరెస్ట్ చేసి.. హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఐసీటీ.. ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.