Logo
Download our app
సొంతగడ్డపై టీమిండియా చెత్త రికార్డు
NEWS   Oct 17,2024 11:14 am
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. పిచ్‌పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను హడలెత్తించారు. దీంతో టీమిండియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు. ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. 37 ఏళ్ల నాటి ఈ రికార్డు నేటితో తెరమరుగైంది.
⚠️ You are not allowed to copy content or view source