కొమరం భీంకు మంత్రి సీతక్క నివాళి
NEWS Oct 17,2024 11:36 am
జల్, జంగల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కులకోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వయం పాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీం అని మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క నివాళి అర్పించారు. అలుపెరుగని పోరాటం ఆదివాసీల కోసం చేసి ప్రాణాలు సైతం లెక్కచేయని వీరుడు అని వారు అన్నారు. నేటి సమాజానికి వారి సేవలు ఆదర్శనీయమని మంత్రి తెలిపారు.