Logo
Download our app
పిడుగు పాటుకు రైతు మృతి
NEWS   Oct 17,2024 11:47 am
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పిడుగు పాటుకు రైతు కామిడి నర్సింలు మృతి చెందాడు. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు. గ్రామానికి చెందిన రైతు నర్సింలు గురువారం ఉదయం పొలం వద్ద గేదే పాలు పిండేందుకు అక్కడే ఉన్న నీటిసంపు వద్ద కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటుండగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source