పార్టీ సభ్యుత్వ నమోదు వేగవంతం
NEWS Oct 17,2024 07:35 am
బీజేపీ సభ్యుత్వ నమోదు ప్రక్రియను మండల బీజేపీ పార్టీ నేతలు వేగవంతం చేశారు. వట్పల్లి మండల కేంద్రంలో నేతలు ఇంటింటికి తిరుగుతూ బీజేపీ దేశంలో, తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ సభ్యుత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చెయ్యాలని ఈ సందర్బంగా పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు.