వాల్మీకి మహార్శి జయంతి వేడుకలు
NEWS Oct 17,2024 11:38 am
జగిత్యాల: మహర్షి వాల్మీకి తన కవిత్వం ద్వారా సామరస్యం, ప్రేమ, త్యాగం, అభివృద్ధి ఆధారిత పాలనను ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహార్శి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.