ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష
NEWS Oct 17,2024 07:01 am
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వాటి నిర్వహణపై చర్చించారు. మండలంలో మొత్తం 12 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా. వీటిలో ఐకేపీ ఆధ్వర్యంలో 5, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 4, డీసీఎంఎస్ ఆధ్వర్యాన 3 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.