అపరిచితులపై సమాచారం ఇవ్వండి: DSP
NEWS Oct 17,2024 05:09 am
ఇల్లందు మండలం రాజీవ్ నగర్ కాలనీలో డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో సీఐ బత్తుల సత్యనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో భాగంగా పత్రాలు, ఇన్సూరెన్స్, లైసెన్స్ లేని 24 వాహనాలు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నామని డిఎస్పి చంద్రభాను తెలిపారు. రాజీవ్ నగర్ నివాసులకు కొత్త చట్టాలు గురించి అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఊరికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.