సేవాలాల్ బంజారా అధ్యక్షుడిగా శ్రీను
NEWS Oct 17,2024 05:59 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సేవాలాల్ బంజారా సంఘం లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడిగా శ్రీను నాయక్ ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయక్ నియమిస్తూ పత్రాలు అందజేశారు. గిరిజనుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని నియమితులైన శ్రీను అన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గిరిజనులకు రావాల్సిన రిజర్వేషన్ల గురించి పోరాడుతానని చెప్పారు. పోడు సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు.