రేపు ఖమ్మంలో జాబ్ మేళా
NEWS Oct 17,2024 05:38 am
జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి మాధవి తెలిపారు. రిలయన్స్ ట్రెండ్స్, భారత్ హ్యుండాయ్ సంస్థల బాధ్యులు హాజరై ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన జిల్లాలోని నిరుద్యోగ యువత, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. 7036902902, 9392922065 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.