TUCIలో IFTU విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ
NEWS Oct 16,2024 05:33 pm
వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో ఉన్న బీడీ సెంటర్ వద్ద కార్మికులతో కలిసి తెలంగాణ ప్రగతిశిలా బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు అరవింద్ TUCI లో IFTU విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల అక్టోబర్ 20 న హైదరాబాద్లో జరిగే సభను కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విలీన సభను విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, చెకర్స్, ప్యాకర్స్ తదితరులు పాల్గొన్నారు.