ASR: గన్నేరుపుట్టులో పల్లె పండగ
NEWS Oct 16,2024 05:24 pm
గన్నేరుపుట్టు పంచాయితీ కేంద్రంలో ఘనంగా పల్లె పండగ ఉత్సవాల్లో భాగంగా కొత్త పనులకు శంకుస్థాపనలు చేశారు. గన్నేరుపుట్టు పంచాయితీలో మినీ గోకులం షెడ్ నిర్మాణానికి హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, గన్నేరుపుట్టు పంచాయితీ సర్పంచ్ సోకేలి కృష్ణా రావు, బొడ్డా పుట్టు సూపర్ సర్పంచ్ పాడి బాలన్నతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ మినీ గోకులం ఏర్పాటుతో పశు పోషణ అభివృద్ధి, మేకల, గొర్రెల పెంపకంతో రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందుతుందన్నారు.