విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
NEWS Oct 16,2024 05:25 pm
హుకుంపేట: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్ఐ సురేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధ్యార్ధులకు అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ ముద్రించిన పోస్టర్లను అవిష్కరించారు. విద్యార్థి దశ నుంచే గంజాయి, మద్యపానానికి బానిసై చెడు వ్యసనాలతో జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.