Logo
Download our app
ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందే..
NEWS   Oct 16,2024 03:44 pm
ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. క్యాట్ ఆదేశాలను కోర్టు సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్ అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సి ఉంది.
⚠️ You are not allowed to copy content or view source