చర్చి నిర్మాణానికి మంత్రి విరాళం
NEWS Oct 16,2024 02:02 pm
బోనకల్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విజ్ఞప్తి మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రావినూతల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చర్చికి 20వేలను ఖమ్మంలోని వారి క్యాంపు కార్యాలయంలో విరాళంగా అందించారు. భవిష్యత్తులోనూ చర్చి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విరాళం అందుకున్న చర్చి నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.