ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి
NEWS Oct 16,2024 02:04 pm
ఖమ్మం జిల్లా: పాలేరు నియోజకవర్గం, కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ మండలం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఎదులపూరం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్ సమస్యలను కాంగ్రెస్ యువజన నాయకులు భూక్యా సురేష్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించి అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సురేష్ నాయక్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.