త్వరలో జిల్లాలో నూతన కమిటీలు
NEWS Oct 16,2024 02:07 pm
ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా ఆదేశానుసారం జిల్లాలోని కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం, మండల, పట్టణ గ్రామ కమిటీలు పార్టీ అనుబంధ సంస్థ కమిటీలన్నీ రద్దు అయ్యాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొర్రా కిరణ్ తెలిపారు. త్వరలో జిల్లా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యకర్తలందరూ సమిష్టి కృషి చేసి పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి పోతురాజు ఏసు దాసు,అక్కల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.