బాధిత కుటుంబాలను పరామర్శా
NEWS Oct 16,2024 05:12 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండల పరిధిలో ఇందిరానగర్ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బూర్గంపాడు మండలం బుడ్డగూడెంకు చెందిన యువకుల భౌతిక కాయాలను సిపిఎం మండల కార్యదర్శి బత్తులవెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేటి యువత సన్మార్గంలో నడవాలని సూచించారు.