4 రోజుల పాటు వర్షాలు..!
NEWS Oct 16,2024 11:43 am
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు భారీ నుండి అతి భారీ వర్ష సూచన. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది.