దుర్గమ్మ మండపంలో అన్నదాన కార్యక్రమం
NEWS Oct 16,2024 02:06 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బస్ డిపో దగ్గర ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్, అడపా వెంకటేశ్వరరావు, గోల్డ్ రవి, శ్రీరాముల పెద్దులు, మురళి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.