అఖిల భారత రైతు కూలి సంఘం ధర్నా
NEWS Oct 16,2024 09:26 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గార్ల మండలo తహసిల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జి సక్రు పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఫ్రీ బస్సు మినహా మిగతా 5 గ్యారంటీలపై 10 నెలలు గడుస్తున్న ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోలేదని అన్నారు. అనంతరం గార్ల డిటి గారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో గార్ల మండల నాయకులు పాల్గొన్నారు.