బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతాం
NEWS Oct 16,2024 10:09 am
హైదరాబాద్ బస్తీలకు రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 50 ఏండ్ల క్రితం ప్రభుత్వమే పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చింది. వాళ్లతో నల్లా బిల్లు, కరెంట్ బిల్లు కట్టించుకుంది. ఇప్పుడేమో నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారంటూ విమర్శించారు.