నిర్మాణపు పనులకు నాణ్యత ఉండాలి
NEWS Oct 16,2024 08:35 am
అభివృద్ధి పనుల అన్నింటిలో నాణ్యత ఉండాలని, పనులన్నీ అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేట ఎస్సీ కాలనీలో SDRF నిధులు రూ. 25 లక్షలతో చేపట్టిన సీసీ కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న 2 లైన్ల కాలువ నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.