PDSU అర్ధ శతాబ్దోత్సవ సభల పోస్టర్
NEWS Oct 16,2024 08:32 am
BDK: ఈనెల 21న ఖమ్మం, 24న హైదరాబాదులో జరిగే PDSU అర్ధ శతాబ్దోత్సవ సభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందు కోర్టు సెంటర్లో పోస్టర్‌ను PDSU పూర్వ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జడ సీతారామయ్య ఆవిష్కరించారు. 50 ఏండ్ల విప్లవ ప్రస్థానంలో విద్యార్థుల పక్షాన PDSU నిలబడి విద్యార్థుల విద్యా హక్కుల కోసం వీరోచితంగా పోరాడిందని గుర్తు చేశారు. దేశంలో అధికార మార్పిడి జరిగి 7 దశాబ్దాలు దాటిన పేదవారికి విద్య, వైద్యం, ఉపాధి దొరకడం లేదన్నారు.