నిందితులను కఠినంగా శిక్షించాలి
NEWS Oct 16,2024 08:23 am
జగిత్యాల: సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై జగిత్యాల జిల్లా కేంద్రంలో జయదుర్గ సేవా సమితి ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో ధర్నా చేశారు. నిందితుడి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.