పశువులకు ఉచిత టీకాలు వేయించాలి
NEWS Oct 16,2024 06:06 am
మెట్‌పల్లి మండలంలోని చౌలమద్ది, వెల్లుల్ల గ్రామాల్లో పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు మండల పశువైద్య అధికారిణి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ తెలిపారు. డా. మనీషా మాట్లాడుతూ.. వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి, వ్యాధి సోకిన పశువు నుండి మరొక పశువుకు గాలి ద్వారా వ్యాప్తి, వ్యాధి లక్షణాలు పాలిచ్చే పశువులు ఒక్కసారిగా పాల దిగుబడి తగ్గి పాడిరైతులు తీవ్రంగా నష్టపోతారని, పాడి రైతులు గేదెలు, ఆవులు, ఎద్దులు, టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు.