శని, ఆదివారాలు అన్నదాన కార్యక్రమం
NEWS Oct 16,2024 05:54 am
భద్రాచలం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదాన కార్య క్రమం నిర్వహించనున్నట్లు భద్రాచలం దేవస్థానం ఈఓ రమాదేవి తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవ స్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలలకు వారాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఆలయంలో అన్నదానం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.