నేడు డయాలసిస్ సెంటర్ ప్రారంభం
NEWS Oct 16,2024 04:46 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి కిడ్నీ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లి డయాలసిస్ చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయించారు. దీంతో కిడ్నీ రోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.